Love Life | న్యూఢిల్లీ: తమ లవ్ లైఫ్ అంత సంతోషంగా సాగడం లేదని చాలా మంది భారతీయులు చెప్తున్నారు. ఇప్సోస్ అనే సంస్థ 30 దేశాల్లో ప్రేమ జీవితంపై సర్వే నిర్వహించింది. ‘లవ్ లైఫ్ శాటిస్ఫాక్షన్ 2025’ పేరుతో ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. సంతృప్తికర ప్రేమ జీవితాలు సాగిస్తున్న వారు భారత్లో తక్కువేనని ఈ సర్వే తేల్చింది.
కొలంబియాలో అత్యధికంగా 82%, థాయ్లాండ్, మెక్సికో, ఇండోనేషియాలో 81% మంది ప్రేమ జీవితాలు సంతృప్తికరంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలగా, భారత్లో 63% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారట. ఉమ్మడి కుటుంబం, కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిళ్ల కారణంగా భారతీయులు ప్రేమ, లైంగిక జీవితానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారట.