గుణ: మధ్యప్రదేశ్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ శివాలయాన్ని(Lord Shiva Temple) ధ్వంసం చేశారు. గుణ జిల్లాలో ఉన్న బమోరి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఆ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దుండగులు పెకిలించివేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ శివ లింగాన్ని బయట పడేసినట్లు చెప్పారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన స్థానికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో రోడ్లను బ్లాక్ చేశారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలో బమోరి పట్టణం ఉన్నది. నిందితులను అరెస్టు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. శాంతిభద్రతల కోసం భారీ సెక్యూర్టీని ఏర్పాటు చేశారు. బమోరి పట్టణ శివారు ప్రాంతంలో శివాలయం ఉన్నట్లు పోలీసు ఇంచార్జీ అరవింద్ గాడ్ తెలిపారు. అయిదారుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.