Kuzhimandhi: కుజుమండి తింటున్నట్టుగా కృష్ణుడి పోస్టర్.. కస్టడీలోకి రెస్టారెంట్ ఓనర్లు
Kuzhimandhi: కేరళలో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు అరేబియన్ మాంసాహార వంటకం కుజుమండి తింటున్నట్లుగా ఇటీవల ఓ పోస్టర్ క్రియేట్ చేశారు. ఆ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు.
అలపుజా: కేరళలో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కుజుమండి(Kuzhimandhi) తింటున్నట్లుగా ఇటీవల ఓ పోస్టర్ క్రియేట్ చేశారు. మలయాళం కొత్త సంవత్సరం విషు సందర్భంగా ఓ రెండు రెస్టారెంట్లు ఆ పోస్టర్‌ను తయారు చేసి ప్రచారం కోసం వాడుకున్నాయి. అరేబియన్ నాన్‌వెజ్ వంటకం కుజుమండి డిష్‌ను కృష్ణుడి వద్ద ఉన్నట్లు ఫోటో డిజైన్ చేశారు. ఈ కేసులో నిందితులను అర్షద్, షామ్నాస్గా గుర్తించారు. మెహర్ మండి అండ్ గ్రిల్స్ రెస్టారెంట్‌ను వాళ్లు నడుపుతున్నారు. బీఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 192(కావాలని రెచ్చగొట్టడం) కింద వారిని బుక్ చేశారు. ఆన్లైన్ ప్రమోషన్ కోసం ఆ ఫోటోను రెస్టారెంట్లు వాడాయి. హ్యాపీ విషు అని మెసేజ్ చేసి, కృష్ణుడి ముందు కుజుమండి డిష్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఆ ఫోటోను షేర్ చేసినట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. ఏప్రిల్ 15వ తేదీన వాట్సాప్ స్టేటస్ రూపంలో ఆ ఇమేజ్ను షేర్ చేశారు. వివాదం నేపథ్యంలో రెస్టారెంట్ ఓనర్లు ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

