లక్నో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆవులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటికి కూడా వినోదం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిత్యం శ్రీకృష్ణ భజనలను స్పీకర్లలో వినిపించనున్నారు. ఉత్తరప్రదేశ్ హమీర్పూర్ జిల్లా అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. కన్హా గోశాలలోని ఆవులకు ప్రతి రోజూ లౌడ్స్పీకర్లో తక్కువ వాల్యూమ్‌తో భజనలు వినిపించనున్నారు. ఉదయం, సాయంత్రం గోవులకు శ్రావ్యమైన కృష్ణుడి పిల్లన గ్రోవి మ్యూజిక్, కీర్తనలను ప్లే చేయాలని, తద్వారా వాటికి ఆనందం కలిగించాలని జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
కాగా, గత వారం జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ కమలేష్ దీక్షిత్ కన్హా గోశాలను సందర్శించారు. ఆవులకు పూజలు చేసి బెల్లం తినిపించారు. శీతాకాలంలో చలి నుంచి రక్షణ కోసం వాటికి శాలువాలు కూడా కప్పారు.