Kedarnath Dham | డెహ్రాడూన్ : కేదార్నాథ్ ఆలయం రేపు తెరుచుకోనుంది. ఈ నేపథ్యంలో ఆలయం అలంకరణ పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు కనువిందు కలిగించే విధంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 1300 కిలోల బంతిపూలతో కేదార్నాథ్ ఆలయాన్ని అలంకరిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ బాబా కేదార్నాథ్ ధామ్ టెంపుల్ మే 2వ తేదీన ఉదయం 7 గంటలకు తెరుచుకోనుంది.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.
#WATCH | Uttarakhand | The decoration work continues at Shri Baba Kedarnath Dham. Lord Kedarnath’s temple is being decorated with 13 quintals of marigolds.
Baba Kedarnath’s doors will open for devotees on 2 May at 7 am. pic.twitter.com/8z4WECMgPZ
— ANI (@ANI) May 1, 2025