Bipin Rawat | బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించేందుకు విపక్ష ఎంపీలను అనుమతించ లేదు : మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ : తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించేందుకు విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ అనుమతించలేదని పెద్దల సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రకటన చేసిన అనంతరం ఈ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ సహా ఇతరులకు నివాళులు అర్పించేందుకు ఎంపీలందరికీ సమయం కేటాయించాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించారు.
ప్రభుత్వ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంపై సభ తీవ్ర దిగ్భ్రాంతిని సానుభూతిని వ్యక్తం చేసినందున విడివిడిగా సభ్యుల ప్రకటన అవసరం లేదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు. రాజ్‌నాధ్ సింగ్ ప్రకటన అనంతరం సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై మాట్లాడేందుకు విపక్ష పార్టీల నేతలకు కొంత సమయం కేటాయించాలని కోరినా ప్రభుత్వం, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిరాకరించారని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. సభను ప్రభుత్వం ఇష్టానుసారం నడుపుతోందని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

