న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సుప్రీంకోర్టు మూడుమాసాల కాలంలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతున్నది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 16న రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో సీజే కానున్న జస్టిస్ యూయూ లలిత్ కేవలం రెండు మాసాలకే నవంబర్ 8న రిటైరవుతారు.
దాంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ఆయన రెండు సంవత్సరాల వరకు ఆ పదవిలో కొనసాగుతారు.