Loneliness | న్యూఢిల్లీ: స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసుండటం మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంతో పాటు గుండె జబ్బులు, గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఇన్ఫెక్షన్ల లాంటి వ్యాధులు రాకుండా నిరోధించే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఫుడాన్ యూనివర్సిటీ యూకే బయె బ్యాంక్‌లోని 42 వేల మంది డాటాను విశ్లేషించిన తర్వాత ఈ వివరాలను వెల్లడించింది.
నలుగురితో కలవకపోవడం, ఒంటరిగా ఉండటం వల్ల రక్తంలో ఉండే నిర్దిష్ట ప్రొటీన్లు ఇన్ఫ్లమేషన్(నొప్పి, మంట), రోగనిరోధక శక్తి ప్రతిస్పందన, ఒత్తిడి నియంత్రణ వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులను పెంపొందిస్తాయని వారు కనుగొన్నారు. ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లను ఏడీఎమ్ అనే కీలక ప్రోటీన్ నియంత్రిస్తున్నదని పరిశోధకులు గుర్తించారు. భావోద్వేగాలు, సామాజిక సంబంధాల ప్రాసెసింగ్‌కు బాధ్యత వహించే ఈ ప్రోటీన్ స్థాయిలు ఎక్కువైతే మరణ ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు.