Karnataka | బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇప్పటికే ముడా కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుండగా, తాజాగా రూ.16.85 కోట్ల అంబేద్కర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ను లోకాయుక్త బయటపెట్టింది. విజయపుర జిల్లాలో ఉన్న ఈ సొసైటీ ద్వారా రూ.16.85 కోట్ల భూ కేటాయింపు స్కామ్ జరిగినట్టు వెల్లడించింది.
భూమి లేని ఎస్సీ, ఎస్టీ మహిళలకు పంచాల్సిన భూములను కొందరు నకిలీ పత్రాలతో కాజేసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇటీవల రూ.88 కోట్ల వాల్మీకి కుంభకోణం వెలుగుచూడగా, లోకాయుక్త అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఆ సమయంలోనే తాజా కుంభకోణం బయటపడింది.