Siddaramaiah | ముడా కేసులో సిద్ధరామయ్యకు భారీ ఊరట.. ఎలాంటి ఆధారాలు లేవన్న లోకాయుక్త
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
ముడా భూముల కేటాయింపుల వివాదంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సీఎం సిద్ధరామయ్య కుట్ర చేశారంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై గవర్నర్ విచారణకు అనుమతించారు. సామాజిక కార్యకర్తల వినతి మేరకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు అనుమతి ఇవ్వడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్‌లోని కేసరే గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆమెకు సోదరుడు మల్లికార్జున్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఆ భూమిని అభివృద్ధి చేసేందుకు ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూర్లో కీలకమైన విజయనగర్‌లో 38,238 చదరపు అడుగుల ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ల మార్కెట్ విలువ కేసరేలో స్వాధీనం చేసుకున్న భూమి విలువకంటే ఎక్కువగా ఉంటుందని బీజేపీ ఆరోపించింది. భూ కేటాయింపుల్లో దాదాపు రూ.45కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్రతో సహా పలువురు సీనియర్ ముడా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

