న్యూఢిల్లీ, జూన్ 2: లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక అభ్యర్థుల భవిష్యత్తును వెల్లడించే ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు సోమవారం మీడియా సమావేశం నిర్వహించనుంది.
ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం బహుశా ఎన్నికల సంఘానికి ఇదే తొలిసారి. 2019 ఎన్నికల వరకు ప్రతి విడత ఎన్నిక ముగిసిన తర్వాత దానికి సంబంధించిన వివరాలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు మీడియాకు క్లుప్తంగా వివరించేవారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయానికి వీడ్కోలు పలికి తొలిసారిగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది.