న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో అస్తిత్వం కోసం పోరాడుతున్న వామపక్షాలు గతంతో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలు సాధించాయి. తాజా లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీలు 8 స్థానాలను దక్కించుకున్నాయి. గత లోక్సభలో కేవలం మూడు సీట్లు కలిగిన సీపీఐ(ఎం) తాజా ఎన్నికల్లో మొత్తం నాలుగు చోట్ల గెలుపొందింది. సీపీఐ, సీపీఐ(ఎం)(ఎల్) చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మరికొన్ని చోట్ల వామపక్షాలు గట్టి పోటీని ఇచ్చాయి.