Katchatheevu Island | లోక్‌సభ ఎన్నికల వేళ.. తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ
లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్తూ ఎక్స్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కచ్చైతీవును శ్రీలంకకు ఇవ్వడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందన్నారు.
- లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి
- గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా శ్రీలంకకు ఇచ్చిందని మోదీ విమర్శ
- చైనా ఆక్రమణలపై ఎందుకు స్పందించరని కాంగ్రెస్ దాడి
Katchatheevu Island | న్యూఢిల్లీ/చెన్నై, మార్చి 31: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్తూ ఎక్స్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కచ్చైతీవును శ్రీలంకకు ఇవ్వడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందన్నారు.
దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను దెబ్బతీసిందని విమర్శించారు. తమిళ జాలర్లను తరచూ శ్రీలంక నేవీ అరెస్ట్ చేస్తుండటం, బోట్లు, ఇతర విలువైన మెషినరీని స్వాధీనం చేసుకుంటుండటంపై మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో కచ్చైతీవు అంశం రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉన్నది. తమిళనాడులో ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అప్పగింతను మేం వ్యతిరేకించాం: డీఎంకే
కచ్చైతీవుపై తాజాగా రేగిన రాజకీయ దుమారంపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే స్పందించింది. శ్రీలంకకు కచ్చతీవు అప్పగింతను తమ పార్టీ వ్యతిరేకించిందని పేర్కొన్నది. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ.. చెప్పుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలేమీ లేక, ప్రధాని మోదీ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. 1974లో కచ్చైతీవు అప్పగింతకు వ్యతిరేకంగా డీఎంకే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టిందని పేర్కొన్నారు. కాగా, కచ్చైతీవు అంశాన్ని మోదీ లేవనెత్తడంపై తమిళనాడు పీసీసీ చీఫ్ కే సెల్వపెరుంతగై ఎదురుదాడి చేశారు. భారత భూభాగాల్లో చైనా ఆక్రమణలు, పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన, పుల్వామా ఉగ్రదాడి, మణిపూర్ అల్లర్లపై మోదీ ఎప్పుడు మాట్లాడుతారని ప్రశ్నించారు.
ఏమిటీ వివాదం?
కచ్చైతీవు అప్పగింతకు సంబంధించిన అధికారిక పత్రాలు, రికార్డులను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తీసుకొన్నారు. అవి ఆ దీవిని శ్రీలంక ఎలా స్వాధీనం చేసుకొన్నదనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కచ్చైతీవుకు సంబంధించిన చట్టపరమైన అంశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని, దానిపై సార్వభౌమాధికారానికి సంబంధించి స్పష్టత లేదని అప్పటి విదేశాంగ శాఖ నోట్ ఒకటి పేర్కొన్నది.
అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కచ్చైతీవు జమిందారీ హక్కులను రామనాడు రాజుకు అప్పట్లో అప్పగించిందని, 1875 నుంచి 1948 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ కచ్చైతీవుపై హక్కును కొనసాగించిందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడినట్టు ఆ డాక్యుమెంట్ పేర్కొన్నది. అయితే కచ్చైతీవు అప్పగింతపై భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ప్రధాని సేనానాయకేతో అప్పటి మన దేశ ప్రధాని ఇందిరా గాంధీ రహస్యంగా చర్చలు జరిపారని విపక్షాలు ఆరోపించాయి. శ్రీలంక మ్యాప్‌లో కచ్చైతీవు చూపించడంపై స్పందించిన అప్పటి భారత ప్రభుత్వం.. దీవిని శ్రీలంకకు ఇవ్వలేదని, అది ఒక వివాదాస్పద ప్రాంతమని పేర్కొన్నది. 1974లో కచ్చైతీవును శ్రీలంకకు అప్పగిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సీఎం కరుణానిధికి తెలియజేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

