న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ 75 ఏండ్ల ప్రయాణంపై లోక్సభలో మొదటి రోజు చర్చ వాడీవేడిగా సాగింది. శుక్రవారం రాజ్యాంగంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో సభ రెండుసార్లు వాయిదా పడింది. రాజ్యాంగాన్ని ప్రతిపక్ష నేతలు జేబుల్లో పెట్టుకుంటారని, ఇది వారి పూర్వీకుల నుంచి నేర్చుకున్నారని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు.
బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని ఎప్పుడూ శిరసావహిస్తుందని, వ్యవస్థల స్వతంత్రత, స్వయంప్రతిపత్తితో ఎన్నడూ ఆడుకోలేదని పేర్కొన్నారు. తర్వాత మాట్లాడిన ప్రియాంక గాంధీ.. ‘భారత సంవిధాన్’ అంటే ‘సంఘ్ విధాన్’ కాదని ప్రధాని మోదీ అర్థం చేసుకోలేదని ఆరోపించారు.