న్యూఢిల్లీ: డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం విధించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఇటువంటి యాప్‌ల ద్వారా జరుగుతున్న మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలను కట్టడి చేయడంతోపాటు వీటికి బానిసలవుతున్న వారి సంఖ్య పెరగకుండా నిరోధించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చింది.
వ్యాపార ప్రకటనలను నిషేధించడంతోపాటు, ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సహకరించకుండా నిషేధం విధిస్తూ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025ని సభలో ప్రవేశపెట్టింది.