Locals Capture Crocodile | గంగా ఘాట్లో మొసలి.. బంధించి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు
Locals Capture Crocodile | భక్తులు పవిత్ర స్నానం ఆచరించే గంగా ఘాట్లో మొసలి కనిపించింది. దీంతో ఆ ఘాట్లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. చివరకు మత్య్సకారులు ఆ మొసలిని బంధించారు. అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి దానికి పూజలు చేశారు.
లక్నో: భక్తులు పవిత్ర స్నానం ఆచరించే గంగా ఘాట్లో మొసలి కనిపించింది. దీంతో ఆ ఘాట్లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. చివరకు మత్య్సకారులు ఆ మొసలిని బంధించారు. (Locals Capture Crocodile) అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి దానికి పూజలు చేశారు. అలాగే ఆ మొసలితో కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. గంగా నదిలోని భైరవ్ ఘాట్ వద్ద పెద్ద మొసలి కనిపించింది. దీంతో పవిత్ర స్నానం కోసం ఘాట్లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. మొసలి గురించి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు స్పందించక పోవడంతో చివరకు మత్స్యకారులు దానిని పట్టుకుని బంధించారు.
కాగా, బంధించిన మొసలిని స్థానికులు ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన జనం దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గుడికి వచ్చారు. కొందరు భక్తులు ఆ మొసలికి బొట్టు పెట్టి, హారతులు ఇచ్చి పూజలు చేశారు. మరి కొందరు దాని వద్ద సెల్ఫీలు దిగారు.
మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చాలా సేపటి తర్వాత వచ్చిన వారు ఆ మొసలిని తమ వెంట తీసుకెళ్లారు. సురక్షిత నదీ జలాల్లో విడిచిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా గంగా నది ఘాట్లో మొసలి కనిపించడం, పట్టుకుని బంధించిన దానికి పూజలు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दहशत बना था, आज पकड़ा गया, अस्पताल घाट में मछुवारों ने पकड़ा। #kanpur https://t.co/m1qLB0Lsvp pic.twitter.com/4OUZDABWjx
— Rahul Shukla (Senior photojournalist ) (@PTIrahulshukla) January 31, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

