న్యూఢిల్లీ : అద్నాన్ సమీ తేరా చహ్ర సాంగ్‌ను చిన్న బాలుడు జైనిల్ బత్యల్ హృద్యంగా ఆలపించిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలుడి శ్రావ్యమైన గొంతుతో పాటను పాడిన తీరు సంగీత ప్రియులతో పాటు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. గత నెలలో ఈ వీడియోను నెట్టింట షేర్ చేయగా ఇప్పటివరకూ 27 లక్షల వ్యూస్ రాబట్టింది.
రెండేండ్ల కిందట జైనిల్ పాడిన గులాబీ ఆంఖే కూడా అప్పట్లో వైరల్ అయింది. అప్పటినుంచి వెనుదిరగని చిన్నారి ఆపై పలు పాటలు పాడుతూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాడు. జైనిల్ ఇన్స్టాగ్రాం ఖాతా అతడి సింగింగ్ వీడియోలతో నిండిపోయింది.
లేటెస్ట్ క్లిప్‌లో రాణి ముఖర్జీ, అద్నాన్ సమీపై చిత్రీకరించిన సాంగ్‌ను పియానో ప్లే చేస్తూ పాడటం కనిపిస్తుంది. ఈ పాట అద్భుతమని, తాను ఎప్పుడైనా నిరాశకు లోనైతే ఈ పాటను వింటూ రీచార్జ్ అవుతానని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ చిన్నారి అద్భుతంగా పాడాడని మరో యూజర్ కామెంట్ చేశారు. తేరా చహ్ర ఆల్బం 2002లో విడుదలైంది.
Read More