Viral Video : ముంబైని ఇటీవల భారీ వర్షం ముంచెత్తగా నీట మునిగిన రోడ్డుపై ఓ బాలుడు వీధి కుక్కలతో ఆడుతున్న వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రిధి సుర్తి అనే ఇన్స్టాగ్రాం యూజర్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.
బాంబే..వర్షాలు, అన్మ్యాచ్డ్ లవ్ ఎఫైర్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షలుపైగా వ్యూస్ లభించాయి. ముంబైలో వర్షాలు వినూత్న అనుభూతిని ఇస్తాయంటే నమ్మండని రిధి రాసుకొచ్చారు. ఈ షార్ట్ క్లిప్‌పై కామెంట్స్ సెక్షన్లో పెద్దసంఖ్యలో యూజర్లు ప్రశంసలు గుప్పించారు.
ఇంతటి అందమైన క్షణాలను అద్భుతంగా రికార్డు చేశారని కామెంట్ చేశారు. ఈ వీడియో మొత్తం ఎంతో సంతోషం నింపిందని, వర్షం నీటిలో బాలుడి ఆటలు, కుక్కల పరుగులు, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఎంతో ఆకట్టుకుందని ఓ యూజర్ కామెంట్ చేయగా, మీ మెమరీని అంతే అందంగా రికార్డు చేసి లైవ్లీగా అందించినందుకు థ్యాంక్స్ అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Priyanka Gandhi | వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్.. ఉపఎన్నిక బరిలో ప్రియాంక?!