వచ్చేసింది.. ఆ సమయం రానే వచ్చింది. 2021కి ఘనంగా వీడ్కోలు పలికి కొత్త సంవత్సంర 2022కు వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా రెడీ అవుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. ఇంకో రెండు గంటల్లో ఇండియాలోనూ కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది.
#WATCH Light and laser show at Bandra-Worli Sea Link in Mumbai, Maharashtra on the eve of #NewYear pic.twitter.com/hTvarbHpHr
— ANI (@ANI) December 31, 2021
కాకపోతే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల దేశవ్యాప్తంగా పలు చోట్ల న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆంక్షలు అమలు అవుతున్నాయి. అయినప్పటికీ.. నూతన సంవత్సర వేడుకలను కరోనా ఆంక్షల నడుమే దేశమంతా జరుపుకుంటోంది. తాజాగా న్యూఇయర్ ఈవ్ సందర్భంగా ముంబైలోని బాంద్రా-వర్లీ సీలింక్ వద్ద లైట్, లేజర్ షోను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇదే.