గురువారం 16 జూలై 2020
National - Jun 17, 2020 , 14:48:34

ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌తో సమావేశమైన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌తో సమావేశమైన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

న్యూ ఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) అనిల్‌ బైజల్‌ బుధవారం సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌, డిప్యూటీ సీఎం మనిష్‌ సిసోడియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఈ విషయమై ఆయన వారితో  భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీశారు.  వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, కొవిడ్‌ 19 అధికారులు, సీఎంఓ అధికారులతో వీరు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సమావేశ వివరాలను వైద్య అధికారులు ఎల్‌జీకు తెలియజేశారు. ఢిల్లీలో బుధవారం వరకు 44,688 కరోనా కేసులు నమోదైనట్లు తెలియజేశారు. అందులో 26,351 క్రియాశీలక కేసులుండగా.. 16,500 మంది వ్యాధి నుంచి కొలుకున్నట్లు తెలిపారు. 1837 మంది మరణించినట్లు సమావేశంలో ఆయనకు తెలియజేశారు. 


logo