Karnataka CM : బీజేపీ (BJP) మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ (RSS) పై నిషేధం విధించాలన్న ప్రతిపాదనపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అంతరాయం కలిగించే హక్కు ఏ పార్టీకి లేదని, ఏ సంస్థ కూడా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికే తమిళనాడులో ఆ సంస్థపై చర్య తీసుకున్నారని, దాన్ని పరిశీలించి తదుపరి చర్య చేపడుతామని సిద్ధరామయ్య చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, క్యాబినెట్ విస్తరణపై కూడా సిద్ధూ స్పందించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ సహా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
కోర్టు ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. అన్ని స్థానిక ఎన్నికలను దశలవారీగా నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అన్నారు. ఇక క్యాబినెట్ విస్తరణపై మాట్లాడుతూ.. ముందైతే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే, తర్వాత క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెప్పారు.