Priynaka Gandhi : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార యుడీఎఫ్ (UDF) అభ్యర్థి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పై ప్రతిపక్ష ఎల్డిఎఫ్ (LDF) మంగళవారం ఎన్నికల కమిషన్ (Election commission) కు ఫిర్యాదు చేసింది. ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం కోసం మతపరమైన ప్రదేశాలను దుర్వినియోగం చేశారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమాలు, నిబంధనలను ఉల్లంఘించిందని ఎల్డీఎఫ్ వాయనాడ్ పార్లమెంటరీ కమిటీ మంగళవారం తన ఫిర్యాదులో తెలిపింది.
వాయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 10న ప్రియాంకాగాంధీ.. ‘లేడీ ఆఫ్ లూర్దేస్ చర్చి’లో ప్రార్థనలు చేస్తున్న వీడియోలు, ఫొటోలను ఎల్డీఎఫ్ ఎన్నికల కమిషన్కు సమర్పించింది. ఆ ఫొటోలు, వీడియోల్లో ప్రియాంకాగాంధీతోపాటు ఎమ్మెల్యే, కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ సిద్ధిఖీ, వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్డీ అప్పచన్ కూడా ఉన్నారు.