లక్నో: ముస్లిం వ్యక్తి హిందూ యువతితో కలిసి కోర్టుకు వచ్చాడు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడున్న లాయర్లు వీరి పెళ్లి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముస్లిం యువకుడిపై దాడి చేసి కొట్టారు. (Lawyers thrash Muslim man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 28న మనిహా గ్రామానికి చెందిన సల్మాన్, హిందూ యువతితో కలిసి సివిల్ కోర్టుకు వచ్చాడు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం తన కుటుంబంతో అక్కడ వేచి ఉన్నాడు.
కాగా, వేర్వేరు మతాలకు చెందిన ఈ జంటను అక్కడున్న న్యాయవాదులు గమనించారు. హిందూ యువతి వెంట ఆమె కుటుంబ సభ్యులు లేకపోవడంతో ఈ పెళ్లి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సల్మాన్‌ను నిలదీశారు. అతడు దురుసుగా సమాధానం చెప్పడంతో కొందరు లాయర్లు దాడి చేసి కొట్టారు. ఈ నేపథ్యంలో సల్మాన్, అతడి కుటుంబ సభ్యులు కోర్టు నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకున్నారు. అక్కడున్న హిందూ యువతిని ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇది తెలిసి మహిళ కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
కాగా, సల్మాన్ మోసపూరితంగా తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటున్నాడని యువతి తల్లి ఆరోపించింది. తమ ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకునేందుకు గతంలో కూడా అతడు ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో సల్మాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కోర్టు వద్ద న్యాయవాదులు అతడిపై దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#जौनपुर बेकिंग #मुस्लिम समुदाय के युवक की अधिवक्ताओं ने की जमकर पिटाई..#युवती को प्रेमजाल में फंसाकर कोर्ट मैरिज करने कोर्ट आया था युवक..
सूचना मिलने पर #युवती के परिवार वाले भी पहुंचे कहचरी..#मां ने आरोपी के खिलाफ थाने में दी तहरीर..#viral #jaunpur@jaunpurpolice @Uppolice pic.twitter.com/gNWmV3k1Hx— Abhi (journalist ) (@AbhiChaubeylive) March 1, 2025