Watch: కోర్టులో కొట్టుకున్న ఇద్దరు న్యాయవాదులు.. వీడియో వైరల్
Lawyers Altercation | మహిళా లాయర్ చెంపపై మగ న్యాయవాది రెండు సార్లు కొట్టాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడ్ని కొట్టగా తిరిగి ఆమెను కొట్టాడు. వారిద్దరి మధ్య కోట్లాట తీవ్రం కావడంతో అక్కడున్న మిగతా న్యాయవాదులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు.
న్యూఢిల్లీ: ఇద్దరు న్యాయవాదులు కోర్టులో కొట్టుకున్నారు (Lawyers Fight). మహిళా లాయర్ చెంపపై మగ న్యాయవాది కొట్టగా ఆమె తిరిగి అతడ్ని కొట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ సంఘటన జరిగింది. గురువారం లాయర్లు విష్ణు కుమార్ శర్మ, నేహా గుప్తా మధ్య ఒక విషయంపై వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నేహా గుప్తా చెంపపై విష్ణు కుమార్ రెండు సార్లు కొట్టాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడ్ని కొట్టగా తిరిగి ఆమెను కొట్టాడు. వారిద్దరి మధ్య కోట్లాట తీవ్రం కావడంతో అక్కడున్న మిగతా న్యాయవాదులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిద్దరూ వెనక్కి తగ్గలేదు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
కాగా, ఈ సంఘటన తర్వాత విష్ణు కుమార్ శర్మపై నేహా గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న కోర్టు రూమ్ వద్ద ఉన్న తనపై ఆ న్యాయవాది అకారణంగా దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ దాడిలో తన ముఖంతోపాటు శరీరంపై పలు గాయాలైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు లాయర్ల మధ్య ఫైట్ సందర్భంగా అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#NewDelhi: A video capturing an intense fight between two lawyers, one of whom is a woman, within the premises of the Rohini court, has taken social media by storm.
A senior police official said that they have received that complaint and further investigation is going on in the… pic.twitter.com/Giw3erSTs4
— IANS (@ians_india) May 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

