న్యూఢిల్లీ: సీజేఐ గవాయ్‌పై షూ విసిరేయబోయే ఘటన పట్ల తానేమీ పశ్చాతాపం పడడం లేదని అడ్వకేట్ రాకేశ్ కిషోర్ (Lawyer Rakesh Kishore)అన్నారు. గవాయ్‌పై షూ విసిరేయబోయిన ఘటన గురించి మీడియాతో ఆ లాయర్ మాట్లాడారు. ఆ ఘటన పట్ల తానేమీ నిరాశ చెందడంలేదన్నారు. నేనేమీ భయడడం లేదని, జరిగిన దానికి చింతించడం లేదని అన్నారు. సెప్టెంబర్ 16వ తేదీన కోర్టులో ఓ పిల్ వేశామని, ఆ కేసులో సీజేఐ తీర్పునిస్తూ.. దేవుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోవాలన్నారని, సనాతన ధర్మం అంశంపై కేసులు వస్తే, సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తోందని ఆయన ఆరోపించారు. పిటీషన్‌దారుడికి రిలీఫ్ ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ ఆ పిటీషనర్‌పై వెటకారం సరికాదు అని లాయర్ రాకేశ్ తెలిపారు. ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యల పట్ల బాధపడ్డానని, కానీ తానేమీ తాగి షూ విసిరే ప్రయత్నం చేయలేదన్నారు. ఆ వ్యాఖ్యలకు ఇది నా కౌంటర్ అని అన్నారు.
#WATCH | Delhi: Suspended Advocate Rakesh Kishore, who attempted to hurl an object at CJI BR Gavai, says, “…I was hurt…I was not inebriated, this was my reaction to his action…I am not fearful. I don’t regret what happened.”
“A PIL was filed in the Court of CJI on 16th… pic.twitter.com/6h4S47NxMd
— ANI (@ANI) October 7, 2025
నా పేరు డాక్టర్ రాకేశ్ కిషోర్. ఎవరైనా నా కులం ఏంటో చెప్పగలరా? నేను కూడా దళితుడినే కావొచ్చు. సీజేఐ దళితుడన్న కోణంలో మీరు ఆలోచిస్తున్నారేమో.. కానీ ఆయన దళితుడు కాదు.. ఆయన తొలుత సనాతన హిందువు అని, కానీ ఆయన తన మతవిశ్వాసాన్ని వీడి, బౌద్ద మతాన్ని స్వీకరించారన్నారు. ఒకవేళ హిందూ మతాన్ని వదిలేసి.. బౌద్ధాన్ని స్వీకరిస్తే, అప్పుడు ఆయన ఎలా దళితుడు అవుతాడని లాయర్ రాకేశ్ ప్రశ్నించారు. ఇదంతా మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశమని ఆయన అన్నారు.
తానేమీ క్షమాపణలు కోరబోనన్నారు. అలాగే చింతించే అంశం కూడా కాదన్నారు. సున్నిత అంశాలను పరిగణలోకి తీసుకుని జడ్జీలు పనిచేయాలన్నారు. లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, తానేమీ చేయలేదని, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారని, అందుకే దేవుడే నాతో ఈ పని చేయించారని లాయర్ కిషోర్ పేర్కొన్నారు.
ఖజురహో ఆలయ సమూహంలో ఉన్న ఓ గుడిలోని విష్ణువు విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని దాఖలు చేసిన పిల్‌పై సీజేఐ స్పందిస్తూ కొన్నివ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ లాయర్ రాకేశ్ సోమవారం సీజేఐపై దాడికి ప్రయత్నించారు. గవాయ్‌పై షూ విసరబోయిన లాయర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 71 ఏళ్ల లాయర్ మయూర్ విహార్‌లో ఉంటున్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో ఆయన రిజిస్టర్ సభ్యుడు.