న్యూఢిల్లీ, జూన్ 14: మీడియా స్వేచ్ఛను అణచివేసేలా ఉన్న ఐటీ సవరణ నిబంధనలు-2023, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం-2023 సహా పలు ఇతర చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. సమాచారం తెలుసుకొనే ప్రజల హక్కును నిర్ధారించాలని స్పష్టం చేశాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో బ్రాడ్కాస్ట్, డిజిటల్ మీడియాలతో కూడిన సంస్థను తీసుకురావాలని సూచించాయి.
వర్కింగ్ జర్నలిస్టు అండ్ అదర్ న్యూస్పేపర్ ఎంప్లాయీస్(కండిషన్ ఆఫ్ సర్వీస్) చట్టం-1955, వర్కింగ్ జర్నలిస్ట్స్(ఫిక్సేషన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ వేజేస్) చట్టం-1958లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి. ఆ చట్టాల్లో బ్రాడ్కాస్ట్, డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా చేర్చాలని కోరాయి.