చెన్నై: కదులుతున్న కారు సన్‌రూఫ్ తెరిచిన ఒక జంట మద్యం సేవించారు. (Drink Alcohol On Moving Car) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కారు నంబర్ ప్లేట్ ద్వారా ఆ జంటను పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. తాంబరం-పల్లవరం రోడ్డుపై కదులుతున్న కారులో ఒక జంట రొమాంటిక్ స్టంట్‌లో పాల్గొంది. కారు సన్‌రూఫ్ తెరిచిన అబ్బాయి, అమ్మాయి మద్యం సేవించారు. వారు మాట్లాడుకుంటూ డ్రింక్‌ను ఆస్వాదించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ జంటపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ జంటను కూడా పోలీసులు గుర్తించారు. న్యాయ విద్యార్థి అయిన 23 ఏళ్ల సంజయ్, అతడి ప్రియురాలు వీణను అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడంపై కేసు నమోదు చేశారు.
A couple was arrested by Tambaram police for causing a disturbance on GST Road in Chennai. The pair was spotted opening the sunroof of their car and drinking alcohol in public, leading to their apprehension.#Chennai #Alcohol #Viral #LokmatTimes pic.twitter.com/5sJQX4YTg8
— Lokmat Times (@lokmattimeseng) August 5, 2024