రాయ్‌పూర్, మే 31: దేశంలో జనాభా నియంత్రణకు త్వరలోనే చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని జనాభా నియంత్రణపై మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. త్వరలోనే చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు బదులిచ్చారు. కేంద్రప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ విఫలమయ్యిందని మండిపడ్డారు.