న్యూఢిల్లీ : ఇఫ్కో నానో (ద్రవరూపం) డీఏపీ ఎరువు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. అర లీటర్ బాటిల్ డీఏపీ రూ.600 లభించనున్నది. సంప్రదాయ డీఏపీ ఎరువు (డీ-అమోనియం ఫాస్పేట్) 50 కిలోల బస్తా ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.1,350కి విక్రయిస్తున్నారు. అంతే మొత్తానికి పొలానికి సరిపోయే నానో డీఏపీ సగం ధరకే లభిస్తున్నది. దీంతో దేశానికి ఎరువుల దిగుమతి భారం తగ్గనున్నది.