న్యూఢిల్లీ: మన్ కీ బాత్ 85వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ.. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పెద్దపులి అంత్యక్రియల గురించి ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌లో కొల్లార్‌వాలి అనే ఆడపులి మృతిచెందితే మనిషికి చేసినట్లుగానే అంత్యక్రియలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
భారతదేశ సంస్కృతిలో ప్రకృతిని, ప్రకృతిలోని ప్రతి ప్రాణి ఒకేలా ప్రేమించబడుతాయనడానికి ఆ ఆడపులి అంత్యక్రియలే నిదర్శనమన్నారు. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఇటీవల ఓ ఆడపులి అనారోగ్యంతో మరణించింది. ఆ పులిని టైగర్ రిజర్వ్‌లోని సిబ్బంది అంతా కొల్లార్వాలీ అని పిలిచేవారు. ఆ పులికి మనిషికి చేసినట్లుగానే సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు.
కొల్లావాలి అనే ఆగపులి పంచ్ టైగర్ రిజర్వ్‌కే ఒక గర్వకారణమని అటవీ అధికారులు చెప్పారు. ఈ నెల 15న ఆ పులి వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆ పులి మరణించిందని తెలిపారు. కాగా, ఆ పులి మరణించిన రోజు దాని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ తమ సొంత మనిషిని కోల్పోయినంతగా బాధపడ్డారని ప్రధాని చెప్పారు.