న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్విస్టిగేసన్ ఏజెన్సీ పురోగతి సాధించింది. ఈ దాడికి సంబంధించి ప్రమేయం ఉన్న వారిలో లష్కరే తాయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఫరూఖ్ అహ్మద్‌ను ముఖ్యుడిగా గుర్తించింది.
ఈ నెల 22న పహల్గాం దాడి కేసులో ఉగ్రవాదులకు లాజిస్టికల్ సహాయం అందించిన ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ (ఓజీడబ్ల్యూస్) విస్తృత నెట్‌వర్క్‌ను ఫరూఖ్యే స్థాపించాడని భావిస్తున్నారు. కశ్మీర్‌లోని కుప్వారాకు చెందిన ఫరూఖ్ ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాడు. ఉగ్రవాదులు పాకిస్థాన్ సరిహద్దు గుండా మూడు వేర్వేరు సెక్టార్ల ద్వారా కశ్మీర్లోకి ప్రవేశించడానికి సహాయపడటంలో ఫరూఖ్ కీలక పాత్ర పోషించాడు.