చెన్నై : హిందీ భాష గురించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ అశ్విన్‌కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై బాసటగా నిలిచారు. హిందీ జాతీయ భాష కాదని, తాను కూడా అదే చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నామలై ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజమే, హిందీ జాతీయ భాష కాదు. నేను కూడా మీతో ఇదే చెబుతున్నా. అది ఎప్పటికీ మనందర్నీ (దేశ ప్రజలు) కలిపే భాష మాత్రమే. హిందీ సౌకర్యవంతమైన భాష’ అని పేర్కొన్నారు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందీని తమిళనాడులో బలవంతంగా రుద్దడాన్ని తమ పార్టీ సహించబోదని 2022లో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష కాదు, అది అధికారిక భాష మాత్రమేనని అశ్విన్ చెప్పిన విషయం విదితమే.