Landmine Blast | పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి ఉప జిల్లాలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక సైనికుడు అమరవీరుడు కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సైన్యంలోని 7వ రెజిమెంట్‌కు చెందిన నాయబ్ సుబేదార్ హరి రామ్, హవల్దార్ గజేంద్ర సింగ్, సిపాయి లలిత్ కుమార్ తమ ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో సాధారణ గస్తీలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆ ప్రాంతంలో పాతిపెట్టిన M-16 ల్యాండ్ మైన్ పేలింది. దాంతో నాయబ్ సుబేదార్ హరి రామ్ పేలుడులో అమరడుయ్యాడు. హవల్దార్ గజేంద్ర సింగ్, సిపాయి లలిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సైనిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సంఘటన గురించి అధికారులకు సమాచారం అందిన వెంటనే సహాయ, రక్షణ చర్యలు చేపట్టారు.