న్యూఢిల్లీ : ట్రాయ్ గురువారం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే, ల్యాండ్‌లైన్ యూజర్లు లోకల్ కాల్స్ కోసం 10 అంకెలను తప్పనిసరిగా డయల్ చేయాల్సి రావచ్చు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కోసం ఫిక్స్డ్ లైన్ ఫోన్ నంబర్లకు గిరాకీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో తగిన ప్రణాళికను రూపొందించాలని టెలికం శాఖ ట్రాయ్‌ను కోరింది. ల్యాండ్‌లైన్‌కు 10 అంకెల ఫోన్ నంబరును ఇస్తే, ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయాలంటే, మొదట సున్నాను డయల్ చేసి, ఆ తర్వాత ఎస్టీడీ కోడ్‌ను, అనంతరం సబ్‌స్ర్కైబర్ నంబరును డయల్ చేయాలని ట్రాయ్ సిఫారసులు పేర్కొన్నాయి.