COAS | ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత సైన్యం భవిష్యత్, దిశ, సాంకేతిక మార్పులు, మానవ కేంద్రీకృత విధానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. సాంకేతికత, భౌగోళిక కలయిక, సాంకేతికత-భూమి మధ్య సమతుల్యత భవిష్యత్‌లో చాలా కీలకమన్నారు. భారత భౌగోళిక స్థానం బట్టి కరెన్సీ ఆఫ్ విక్టరీగా ఉంటుందన్నారు. ట్రంప్, పుతిన్ అలాస్కాలో చర్చల సమయంలో భూమిపై దృష్టి పెట్టారని.. సాంకేతికత మనకు భూమిపై ప్రయోజనాన్ని ఇవ్వాలన్నారు. భూమిపై స్మార్ట్ బూట్స్, బాట్స్ రెండూ ఉంటాయని.. దీని అర్థం సైనికులు, యంత్రాలు కలిసి పని చేయడమన్నారు. అయితే, యుద్ధ సమయంలో సాంకేతికత కొన్నిసార్లు విఫలం కావొచ్చని.. కాబట్టి సైనికులు సాంకేతికత లేకుండా పోరాడగలగాలన్నారు. దీన్ని మేఘ-కేంద్రీకృత, నెట్వర్క్-కేంద్రీకృత యుద్ధం మిశ్రమంగా ఆయన అభివర్ణించారు.
#WATCH | Delhi | Addressing the Delhi Defence Dialogue, COAS General Upendra Dwivedi says, “I would like to just clarify what is the melange or convergence of the technology and the geography. As far as India is concerned, by virtue of land borders, the way we have it, land will… pic.twitter.com/LVZuipnjWI
— ANI (@ANI) November 12, 2025
ప్రపంచం ప్రస్తుతం ఇండస్ట్రీ 4.0ని దాటి ఇండస్ట్రీ 5.0 వైపు కదులుతోందని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఇండస్ట్రీ 4.0 ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి వాటి గురించి మాట్లాడిందని.. కానీ టెక్నాలజీ మానవులను భర్తీ చేయకూడదని, వాటిని పూర్తి చేయాలని 5.0 గ్రహించిందన్నారు. మానవ కేంద్రీకృత సాంకేతికతను స్వీకరించే దిశగా మనం కదులుతున్నందున ఇది భారత సైన్యానికి చాలా ముఖ్యమన్నారు. ఐఏ ద్వారా మానవ విస్తరణ దిశలో మనం ఆలోచించాలని చెప్పారు. ప్రపంచం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, గేమ్ కన్సోల్లు, 7-నానోమీటర్ మైక్రోచిప్‌లను కలిగి ఉన్న టెక్నాలజీ జనరేషన్-7 వైపు కదులుతోందని పేర్కొంటూ జనరల్ ద్వివేది అత్యాధునిక టెక్నాలజీపై స్పందించారు. భారత సైన్యం వాటి ప్రయోజనాలను పెంచుకోగలదని నిర్ధారించుకోవడానికి మనం ఈ సాంకేతికతలన్నింటినీ కలిపి సమగ్రపరచాలన్నారు. వారసత్వ వ్యవస్థలు అదృశ్యం కావని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అవి కనీసం రాబోయే ఐదు నుంచి ఐడేళ్ల వరకు కొనసాగుతాయని.. కాబట్టి మనం వాటిని మెరుగుపరచి సమర్థవంతంగా చేయాలన్నారు.
#WATCH | Delhi | Addressing the Delhi Defence Dialogue, COAS General Upendra Dwivedi says, “Industry 4.0 has moved to Industry 5.0… 4.0 was when the AI, quantum and all this were talked about. But 5.0 has realised that the rebalancing is required to bring in the human element.… pic.twitter.com/JQdYi3tw03
— ANI (@ANI) November 12, 2025
డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో ఇంకా ఖాళీలున్నాయని చెప్పారు. నెట్వర్క్ స్పెక్ట్రం పూర్తిగా పరిణతి చెందలేదని.. ఉపగ్రహ ప్రాజెక్టులు కూడా మూడు సేవల్లో సమయం తీసుకుంటున్నామయని.. 2027 నాటికి దాదాపు 2.3 మిలియన్ల ఏఐ సంబంధిత ఉద్యోగులు ఉంటాయన్నారు. కానీ నైపుణ్యం కలిగిన మానవశక్తి సగం లేదంటే దాదాపు 1.2 మిలియన్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఇదే జరిగితే సైన్యం ఏఐ సేవలను అవుట్సోర్స్ చేయాల్సి వస్తుందన్నారు. ఇది ఖరీదైన ప్రతిపాదన అవుతుందని.. అందుకే మనం ఈ రోజు నుంచే సిద్ధం కావాలని.. పాఠశాలల్లో ఏఐ నైపుణ్యాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సైన్యంలో ఏఐ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నారు. రక్షణ సేకరణ వ్యవస్థలో ఇటీవల ప్రధాన సంస్కరణలు జరిగాయని చెప్పారు. కొత్త రక్షణ సముపార్జన విధానం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. డిసెంబర్ నాటికి ఖరారవుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలవుతుందన్నారు. దేశంలో కొన్ని కీలక టెక్నాలజీ ఇంకా అభివృద్ధి కాలేదని.. ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. సైబర్, డేటా వల్నరబిలిటీస్ లోపాలు ప్రధాన సవాల్‌గా ఆయన అభివర్ణించారు.
#WATCH | Delhi | Addressing the Delhi Defence Dialogue, COAS General Upendra Dwivedi says, “… There is another thing called technology generation-7. The 7.0 technology is the new mobiles and computers of that generation, video game consoles and 7 nanomillion technology for… pic.twitter.com/iKlpp36QiN
— ANI (@ANI) November 12, 2025