ముంబై, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ కుమారుడు పార్థ్పవార్పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. రూ.1804 కోట్ల విలువైన మహర్వతన్ భూమిని కేవలం రూ.300 కోట్లకు కొనుగోలు చేశారు. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ పేపర్‌పై రిజిస్ట్రేషన్ జరిగింది.
ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ లావాదేవీలో కేవలం లక్ష రూపాయల మూలధనం కలిగిన పార్థ్పవార్ కంపెనీ అమేడియా హోల్డింగ్స్ ఎల్ఎల్పీకి రూ.21 కోట్ల స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. పుణే తహసీల్దార్ సూర్యకాంత్ యెవ్లే, డిప్యూటీ రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది.