Lalu Prasad Yadav | బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ (RJD party) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav).. మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి వరుసగా 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (elected unopposed). ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ పునఃనియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం తన 78వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. పాట్నాలోని నివాసంలో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో కట్ చేశారు. ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఈ వయసులో ఆయన మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టడం విశేషం.
Also Read..
Air India | కాల్పుల విరమణ ఒప్పందం.. మళ్లీ విమానాలు నడుపనున్న ఎయిర్ ఇండియా..
Supreme Court | భార్య హత్య కేసులో కమెండో.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!
Actor Aamir Khan | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నటుడు ఆమిర్ ఖాన్