RJD | రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ఎంపికయ్యారు. శనివారం ఆయనకు జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేతలు సర్టిఫికెట్ను అందజేశారు. పట్నాలోని బాపు ఆడిటోరియంలో ఆర్జేడీ కార్యవర్గ సమావేశం జరిగింది. రామచంద్ర పుర్వే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. త్వరలో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న విషయం తెలిసిందే. ఆయన నాయకత్వంలోనే ఆ పార్టీ మరోసారి ఎన్నిలకు సిద్ధమవుతున్నది. లాలూ ప్రసాద్ యాదవ్ జూలై 5, 1997న తన సహచరులతో కలిసి రాష్ట్రీయ జనతాదళ్ను స్థాపించారు.
అప్పటి నుండి లాలూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల ఆర్జేడీ అధ్యక్షుడి బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆయన ఆరోగ్యం గతంలో లేకపోవడమే. కొంతకాలంగా ఆయన తరుచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా అన్ని ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ లాలూ ప్రసాద్ యాదవ్ జూన్ 23న పార్టీ కార్యాలయంలో అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడకపోవడంతో ఎన్నికల అధికారి డాక్టర్ రామచంద్ర పూర్వే ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.