చండీగఢ్, జూన్ 11: పంజాబ్ రవాణా శాఖ మంత్రి, ఆప్ నేత లాల్జీత్ సింగ్ భుల్లర్ కారు టాప్‌పై కూర్చుని ప్రయాణించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. కారుకు ఇరువైపులా ఇద్దరు పోలీసు అధికారులు కూడా ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించారు. దీంతో మంత్రి తీరుపై ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.