లఖింపూర్ ఖీరీ, జూన్ 1: భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత, లఖింపూర్ ఖీరి హింస కేసులో సాక్షి అయిన దిల్బాగ్ సింగ్‌పై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి దిల్బాగ్ సింగ్ అలీగంజ్ నుంచి ఇంటికి వెళ్తుండగా దుండగులు బైక్‌పై వచ్చి ఆయన వాహనాన్ని అడ్డగించారు. కారు తలుపు తెరవడానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో కారుపై కాల్పులు జరిపి పారిపోయారు. అయితే, ఈ దాడిలో దిల్బాగ్ సింగ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.