రోడ్డుపై వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. రెండు బైక్‌లు ఢీకొట్టుకోవడమో లేదా బైక్‌ను వెనుకనుంచి కారు గుద్దడమో చూస్తుంటాం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇక అక్కడ కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయమే. కాగా, ఓ మహిళ స్కూటీ స్కిడ్ అయి కిందపడిపోయింది. తన బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టడం వల్లే పడిపోయానంటూ వెనుక వస్తున్న బైకర్పై తిట్ల దండకం అందుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తున్నారు. అకస్మాత్తుగా బండి స్కిడ్ అయ్యి రోడ్డుపైన పడ్డారు. డ్రైవింగ్ చేస్తున్న మహిళ లేచి వెనుక వస్తున్న బైకర్‌ను నిందించడం ప్రారంభించింది. అయితే, స్కూటీని తాను ఢీకొట్టలేదని, కావాలంటే తాను తీసిన వీడియో చూడాలని సదరు బైకర్ ఎదురుతిరగడంతో ఆమె తోక ముడిచింది. ఈ వీడియోను మీమ్లాజీ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పటివరకూ 3.7 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. 2.7లక్షల లైక్‌లు వచ్చాయి.