Air Force | భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను లడఖ్‌లో అత్యవరసంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ ఎత్తయిన ప్రదేశం కావడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని వైమానిక దళం గురువారం వెల్లడించింది. ఈ ఘటన బుధవారం జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ కోర్టు విచారణకు ఆదేశించింది.
ఈ నెల 3న లడఖ్‌లో ఆపరేషనల్ ట్రెయినింగ్‌లో భాగంగా ఎయిర్‌ఫోర్స్ అపాచీ హెలికాప్టర్ ముందు జాగ్రత్త ల్యాండింగ్ చేసింది’ అని వైమానికదళం ఒక ప్రకటనలో పేర్కొంది. ల్యాండింగ్ ప్రక్రియలో, కఠినమైన భూభాగం, ఎత్తయిన ప్రదేశం కావడంతో దెబ్బతిన్నట్లు తెలిపింది. హెలికాప్టర్‌లోని పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని, వారిని సమీపంలోని ఎయిర్‌బేస్‌కు తరలించామని పేర్కొంది. ఘటనపై ఎయిర్‌ఫోర్స్ కోర్టు విచారణకు ఆదేశించింది.