న్యూఢిల్లీ: తమ దేశం గుండా అమెరికాకు వలసలను అడ్డుకోవడానికి ఎల్ సాల్వెడార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా, 50కి పైగా ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికుల నుంచి వ్యాట్‌తో కలిపి రూ.94 వేల రుసుము వసూలు చేస్తున్నది. ఎల్ సాల్వెడార్ పోర్ట్ అథారిటీ వెబ్‌సైట్‌లోని ఇటీవలి ఓ ప్రకటన ప్రకారం 23 నుంచి ఈ రుసుము వసూలు చేస్తున్నారు. తమ దేశ ప్రధాన విమానాశ్రయాన్ని ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండటం వల్ల ఈ పన్ను విధిస్తున్నట్టు వెల్లడించింది. ఆఫ్రికా, ఇతర దేశాలకు చెందిన చాలామంది వలసదారులు మధ్య అమెరికా ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తారు.