L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
L Murugan : కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తన నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
L Murugan : కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తన నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం మురుగన్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేసే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మురుగన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మురుగన్ రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అంశంపై మురుగన్ ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర మంత్రిగా తన రాజీనామా నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ స్థానం నుంచి తప్పుకొనేందుకు కూడా అనుమతివ్వాలని ప్రధాని మోదీని మురుగన్ కోరారు. మోదీ నాయకత్వంలో పని చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. భరతమాతకు, తమిళనాడుకు సేవ చేయడం తన జీవితంలో గొప్ప విషయమన్నారు. తాను ఒక రోజువారీ కూలీ కార్మికుడి కొడుకు స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానని చెప్పారు.
ఇప్పుడు ఇంక తాను తిరిగి గ్రామస్థాయిలోకి వెళ్లి, బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పని చేస్తానని తెలిపారు. కార్యకర్తల కోసం నిలబడతానని చెప్పారు. ముందు దేశం అని, తర్వాత పార్టీ అని, ఆ తర్వాతే తాను అని పేర్కొన్నారు. మురుగన్ కేంద్ర మంత్రి పదవి చేపట్టకముందు 2017-2020 వరకు జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. అలాగే, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగానూ సేవలందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

