Kuno National Park | మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ మరో రెండు చిరుతలకు స్వాగతం పలికింది. ఆడ చిరుత వీర మంగళవారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా రెండు చిరుత కూనలను ఫొటోలను షేర్ చేశారు. ఆడ చిరుత రెండు కూనలకు జన్మనిచ్చిందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో పని చేస్తున్న అధికారులు, వైద్యులు, ఫీల్డ్ సిబ్బంది అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో చిరుతల సంఖ్య నిరంతరం పెరుగుతోందని.. దాంతో పర్యాటకానికి కొత్త ఊపు వస్తోందన్నారు. అలాగే కొత్త ఉపాధికి తలుపులు తెరుస్తోందన్నారు. చిరుతలతో పాటు అన్ని అటవీ జీవుల పరిరక్షణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
తాజాగా పుట్టిన రెండు పిల్లల సంఖ్యతో కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య పెరిగింది. 12 పెద్ద చిరుతలతోపాటు 14 పిల్లలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రాజెక్ట్ చీతా’ను సెప్టెంబర్ 2022లో ప్రారంభించిన విషయం తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 చిరుతలను కునో నేషనల్ పార్క్‌కి తరలించారు. చిరుత జాతులు దాదాపు 70 సంవత్సరాల కిందట భారత్‌లో అంతరించిపోయాయి. కానీ, ఈ పునరావాస ప్రాజెక్టుతో వాటి సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. కునోలో చిరుతల కోసం సహజంగా ఉండేలా వాతావరణాన్ని సృష్టించారు. దాంతో అవి సురక్షితమైన వాతావరణం.. సౌకర్యవంతంగా గడపనున్నాయి. ప్రాజెక్టు ప్రారంభంలో చిరుతలు చనిపోగా సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో వాటి సంతతి పెరుగుతున్నది.
नन्हें चीतों की किलकारी से फिर गूंजा कूनो.. मध्यप्रदेश की ‘जंगल बुक’ में 2 चीता शावकों की दस्तक…
मुझे यह जानकारी साझा करते हुए अत्यंत आनंद की अनुभूति हो रही है कि मध्यप्रदेश की धरती पर चीतों की संख्या में लगातार वृद्धि हो रही है। आज मादा चीता वीरा ने 2 नन्हें शावकों को जन्म… pic.twitter.com/fCs01pIOtP
— Dr Mohan Yadav (@DrMohanYadav51) February 4, 2025