బెంగళూరు, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు హాలాడి శ్రీనివాస్ శెట్టి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. హిందుత్వ ప్రభావం అధికంగా ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలోని కుందాపుర శాసనసభ స్థానం నుంచి వరుసగా నాలుగు మార్లు బీజేపీ అభ్యర్థిగా, ఒకసారి ఇండిపెండెంటుగా గెలిచారు.