బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka polls) ప్రచారం ఊపందుకోవడంతో ఓట్ల వేటలో నేతలు హామీలు గుప్పిస్తున్నారు. రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందచేస్తుందని జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు.
కోలార్‌లోని పంచరత్నలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కుమారస్వామి మాట్లాడుతూ రైతుల పిల్లల పెండ్లిండ్లను ప్రోత్సహించేందుకు వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతులకు ప్రభుత్వం రూ. 2 లక్షల నగదు అందించాలని కోరారు.
రైతుల కుమారులను పెండ్లి చేసుకునేందుకు యువతులు సుముఖంగా లేరని తన దృష్టికి వచ్చిందని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ పధకం అమలు చేసతే మన యువకుల ఆత్మ గౌరవాన్ని కాపాడవచ్చని అన్నారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. కర్నాటకలో 224 స్ధానాలకు గాను జేడీ(ఎస్) 123 స్ధానాల్లో పోటీ చేస్తుండగా ఇప్పటివరకూ 93 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించింది.
Read More
Karnataka Elections | కన్నడ రాజకీయాల్లో.. అమూల్ పాల పొంగు