DK Shivakumar | జేడీ(ఎస్)ను దాదాపుగా బీజేపీలో విలీనం చేశారు: డీకే శివకుమార్
DK Shivakumar | కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), మాజీ సీఎం కుమారస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(ఎస్)ను ఆయన దాదాపుగా బీజేపీలో విలీనం చేశారని అన్నారు.
బెంగళూరు: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), మాజీ సీఎం కుమారస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(ఎస్)ను ఆయన దాదాపుగా బీజేపీలో విలీనం చేశారని అన్నారు. హనుమాన్ జెండా వివాదంపై మాండ్యాలో బీజేపీ, హిందూ సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాషాయ శాలువా ధరించారు. దీని గురించి మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ స్పందించారు. కుమారస్వామి తన పార్టీని దాదాపుగా బీజేపీలో విలీనం చేసినట్లేనని విమర్శించారు. ‘కాషాయ శాలువా లేదా మరేదైనా శాలువా ధరించడాన్ని కుమారస్వామి ఎంచుకోవచ్చు. అది ఆయన పార్టీ అంతర్గత విషయం. మాండ్యాలో రాజకీయ పునాది కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎవరు ఎవరిని మింగేస్తారో తెలియడం లేదు’ అని అన్నారు.
కాగా, మాండ్యాలో హనుమాన్ జెండా వివాదంపై ప్రజలను రెచ్చగొట్టడానికి బీజేపీ, జేడీ(ఎస్) ప్రయత్నిస్తున్నాయని డీకే శివకుమార్ ఆరోపించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో గ్రామస్తులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘బీజేపీ, జేడీ(ఎస్) మాండ్యాలో ఈ కొత్త ప్రయోగానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఇక్కడి ప్రజలు లౌకికవాదులు, సహనశీలులు’ అని డీకే శివకుమార్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- DK Shivakumar
- jds
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

