Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఢిల్లీలో ఓ బార్బర్ షాప్ (Barber Shop) కు వెళ్లారు. అక్కడ షేవింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా తనకు షేవింగ్ చేసిన అజిత్ అనే బార్బర్‌తో రాహుల్‌గాంధీ ముచ్చటించారు. బార్బర్ తన సాధకబాధకాలను రాహుల్‌గాంధీతో పంచుకున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసినా ‘ఏమి మిగలడం లేదు (కుచ్ నహీ బచ్తా హై)’ సార్ అని చెప్పాడు. బార్బర్‌తో సంభాషణలకు సంబంధించిన వీడియోను ఇవాళ రాహుల్‌గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
“कुछ नहीं बचता है!”
अजीत भाई के ये चार शब्द और उनके आसूं आज भारत के हर मेहनतकश गरीब और मध्यमवर्गीय की कहानी बयां कर रहे हैं।
नाई से लेकर मोची, कुम्हार से लेकर बढ़ई – घटती आमदनी और बढ़ती महंगाई ने हाथ से काम करने वालों से अपनी दुकान, अपना मकान और स्वाभिमान तक के अरमान छीन लिए… pic.twitter.com/1gYGdui2ll
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2024
బార్బర్ అజిత్ చెప్పిన ‘కుచ్ నహీ బచ్తా హై’ అనే నాలుగు పదాల మాట దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలకు నిలువుటద్దమని తన సోషల్ మీడియాలో పోస్టులో రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలతో మంగలివాడి నుంచి చెప్పులు కుట్టేవాడి వరకు, కుమ్మరి వాడి నుంచి వడ్రంగి వరకు అందరి సంపాదన పడిపోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు దోపిడీకి గురవుతున్నారని అన్నారు.
ఎన్డీఏ సర్కారు తీరుతో.. కష్టపడి పనిచేసి షాపులు పెట్టుకోవాలని, సొంత ఇళ్లు కట్టుకోవాలని, ఆత్మగౌరవంతో బతుకాలని సామాన్యులు కంటున్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయని రాహుల్‌గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. ప్రజల బతుకులు బాగుపడాలంటే ప్రభుత్వాలు తీసుకొచ్చే కొత్త పథకాలు వారి ఆదాయాన్ని పెంచేవిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ బార్బర్‌తో మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.