KTR : దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ కారు పేలుడు(Delhi Car Blast)పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఎర్రకోట(Red Fort) సమీపంలో జరిగిన భారీ పేలుడు తనను షాక్‌కు గురి చేసిందని ఆయన అన్నారు. ఈ ఘటనలో పలువరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందిని కేటీఆర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ సమీపంలో జరిగిన పేలుడు వార్త విని షాకయ్యాను. ఎంతో ఆవేదనకు గురయ్యాను. ఈ ఘటనలో పలువురు అమాయక ప్రజలు మరణించారనే హృదయ విదారకరం. మృతుల, బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని కేటీఆర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
Shocked & deeply pained by the news of explosion at Delhi’s Red Fort Metro Station. The report of deaths of several innocent people in this tragic incident is truly heartbreaking
My condolences to the families of the victims and pray for quick recovery of those injured
— KTR (@KTRBRS) November 10, 2025